అనంతపురం జిల్లా అమరాపురం మండలం ఆలదపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో.. ప్రమాదం జరిగింది. కుంబారహళ్లి గ్రామం నుంచి ఆలదపల్లికి రాజప్ప అనే వ్యక్తి సైకిల్ పై వెళ్తున్నాడు. అదే సమయంలో రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై అటుగా ప్రయాణిస్తున్నాడు.
ఈ తరుణంలో.. ద్విచక్ర వాహనం, సైకిల్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వారిద్దరిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.