ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Human Skeletons in Canal : కాలువలో రెండు అస్థిపంజరాలు.. ఎవరివి..? - మోపిడిలో కనిపించిన అస్థిపంజరాలు

Human Skeletons in Canal : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి వద్ద హెచ్ఎల్సీ కాలువలో రెండు మానవ అస్థిపంజరాలు కనిపించడంతో కలకలం మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Human Skeletons in Canal
Human Skeletons in Canal

By

Published : Mar 14, 2022, 11:53 AM IST

కాలువలో కనిపించిన మానవ అస్థిపంజరాలు...అన్వేషణలో పోలీసులు..

Human Skeletons in Canal : అనంతపురం జిల్లాలో రెండు అస్థిపంజరాలు కలకలం సృష్టించాయి. ఉరవకొండ మండలం మోపిడి వద్ద హెచ్ఎల్సీ కాలువలో రెండు అస్థిపంజరాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పోలీసుల వివరాల ప్రకారం...

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి వద్ద హెచ్ఎల్సీ కాలువలో ఆదివారం సాయంత్రం రెండు మానవ అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒకటి స్తీ, మరొకటి పురుషునికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. దాదాపు రెండు నెలల క్రితమే వారు నీటిలో దూకి ఉంటారని భావిస్తున్నారు. నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు కాలువలో ఉన్న తుమ్మచెట్టుకు అక్కడే ఇరుకున్నాయన్నారు. దీంతో అవి పూర్తిగా ఎముకల గూడుగా మిగిలిపోయాయి. ఇటీవలే కెనాల్​కు నీటి ప్రవాహం ఆగిపోవడంతో చెట్లకు చిక్కుకున్న అస్థిపంజరాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. వాటికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు.

ఇదీ చదవండి :

Accident: కారును ఢీకొన్న లారీ.. దంపతులు మృతి

ABOUT THE AUTHOR

...view details