సర్వశిక్షా అభియాన్ నిధుల దుర్వినియోగంతో ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి, పాపసానిపల్లి గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ, లత అనే ఇద్దరు ఉపాధ్యాయులు శనివారం సస్పెండ్ అయ్యారు.
ఇద్దరు ప్రభుత్వోపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు - ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్ వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రభుత్వోపాధ్యాయులను డీఈవో సస్పెండ్ చేశారు. సర్వశిక్షా అభియాన్ నిధులు దుర్వినియోగం, ఎస్సార్లో అర్జిత సెలవుల వివరాలు నమోదు చేయకపోవటం వంటి కారణాలతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది.
teachers suspended
వీరిద్దరూ 2005 నుంచి 2015 వరకు గుడిబండ మండలం సింగేపల్లి, హెచ్.ఆర్.హట్టి గ్రామాల్లోని పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. అప్పట్లో సర్వశిక్షా అభియాన్ కింద చేపట్టిన అదనపు భవనాల నిర్మాణాల పనుల్లో వీరు నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. వీటితో పాటు ఆర్జిత సెలవులు వినియోగించుకొని ఎస్సార్లో నమోదు చేయకపోవటం వంటి కారణాలతో సస్పెండ్ చేస్తున్నామని డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.