ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్​ బాల్​ వివాదం.. తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. - mustikovela latest news

క్రికెట్ బంతి తగిలిందని మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అది రెండు పార్టీల నాయకులు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ ఘర్షణల్లో తెదేపా, వైకాపా వర్గాలకు చెందిన ఐదుగురు గాయపడగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

two gangs fight in mustikovela anantapur
two gangs fight in mustikovela anantapur

By

Published : Jun 22, 2021, 10:06 AM IST

తమ పిల్లలకు క్రికెట్ బంతి తగిలిందని మందలించిన విషయంలో తెదేపా వర్గీయులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా ముష్టికోవెల గ్రామంలో సోమవారం జరిగింది. తెదేపాకు చెందిన ఆంజనేయులు ఇంటి సమీపంలో కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతుండగా.. ఆంజనేయులు కుటుంబానికి చెందిన పిల్లలకు బంతి తగిలింది. దీంతో ఆయన పిల్లలను మందలించారు. తమ పిల్లలను మందలించారని తెలుసుకున్న వైకాపాకు చెందిన చంద్రశేఖర్ వర్గీయులు ఆంజనేయులు కుటుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఆంజనేయులు అతని కుమారుడు నరసింహులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చెన్నేకొత్తపల్లి సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వైకాపాకు చెందిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details