తాగిన మైకంలో ఇద్దరు యువకులు ఘర్షణ పడి.. కత్తితో పొడిచిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. బోయపేటకు చెందినసాయి కుమార్, బండి మోటు శివ ల మధ్య ఘర్షణ జరిగింది.
సాయి కుమార్ అనే యువకుడిని.. బండి మోటు శివ అనే యువకుడు కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన సాయి కుమార్ను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.