ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహమ్మదాబాద్​లో రెండు బైకులు ఢీ, ఇద్దరి మృతి - raod accident at mahammedabad

అనంతపురం జిల్లా మహమ్మదాబాద్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులదేవరచెరువు నుంచి ఆమడగూరుకు హరి, వెంకటరమణ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మరో ద్విచక్ర వాహనంలో నాగభూషణం, ఆదినారాయణ ఓబుల దేవర చెరువు వైపు వచ్చే సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందగా.... తీవ్రంగా గాయపడిన హరి ,చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన ఆదినారాయణ, వెంకటరమణ కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలి వచ్చారు.

Two died as two bikes collide in  mahammedabad
మహమ్మదాబాద్​ రోడ్డు ప్రమాదం

By

Published : Feb 26, 2020, 1:45 PM IST

..

మహమ్మదాబాద్​లో రెండు బైకులు ఢీ

ABOUT THE AUTHOR

...view details