అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం 75 వీరాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో కేపీ దొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందగా, ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం నుంచి బయలుదేరిన ఆటోకు 75 వీరాపురం తండా వద్ద గెదే అడ్డు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కేపీదొడ్డి గ్రామానికి చెందిన శివమ్మ, లక్ష్మీదేవి అనే మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గుమ్మగట్ట పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - అనంతపురంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
two died and three injured in road accident