ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్థిక సమస్యలతో.. వేర్వేరు చోట్ల ఇద్దరు కూలీల ఆత్మహత్య - two daily labors committed suicide ananthapur

అనంతపురం జిల్లాలో ఇద్దరు కూలీలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామంలో ఒకరు, బేలుగుప్ప మండలంలో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.

daily labors committed suicide
అనంతపురంలో ఇద్దరు కూలీల ఆత్మహత్య

By

Published : Mar 31, 2021, 7:34 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మంగళవారం రాత్రి వేరువేరు చోట్ల ఇద్దరు కూలీలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన మారెన్న (35) రాళ్లు కొడుతూ.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అప్పులు అధికమయ్యాయి. ఉపాధి అవకాశాలు తగ్గాయి. కుటుంబ కలహాలు తోడయ్యాయి. వీటన్నింటినీ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బేలుగుప్ప మండలంలో ఒకరు..

బేలుగుప్ప మండలం గంగవరంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్దన్న (50) అనే కూలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న పెద్దన్న.. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి

ABOUT THE AUTHOR

...view details