ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తకుప్పకు మంట పెట్టిన బాలురు... ఇద్దరికీ తీవ్ర గాయాలు

దొరికిన అగ్గిపెట్టెతో ఆడుకుంటూ, చెత్తకు నిప్పు పెట్టటంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా మల్లాపురం గ్రామంలో జరిగింది.

two childrens injured in fire accident
ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలు

By

Published : May 22, 2020, 11:00 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో ఇద్దరు బాలురు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన మంజునాథ్, మణికంఠలు అగ్గిపెట్టెతో ఆడుకుంటూ చెత్తకుప్పకు నిప్పుపెట్టారు. ఆ మంటలు పెద్దవి కావటంతో ఇద్దరు నిప్పంటుకుని గాయాలయ్యాయి. వీరి అరుపులు విన్న గ్రామస్థులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరిలో మంజునాథ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details