అనంతపురం జిల్లా గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామములో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డి అనే రైతు పొలం పనులు ముగించుకొని చెరువులో తన ఎద్దులను నీళ్లు తాగడానికి తీసుకెళ్లాడు. అయితే చెరువులో పూడికను గమనించకపోవటంతో రైతు తన ఎద్దులను నీటిలోనికి పంపాడు. నీటి గుంతలోని పూడికలో ఎద్దులు చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాయి.
పాపం ఎద్దులు నీళ్లు తాగడానికి వెళ్లి.. - Two bulls drowned at ananthapuram district
అనంతపురం జిల్లా గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామంలో రెండు ఎద్దులు నీటిలో మునిగి మృతి చెందాయి. కళ్లెదుటే తన రెండు ఎద్దులు మృతి చెందటంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు.
![పాపం ఎద్దులు నీళ్లు తాగడానికి వెళ్లి.. Two bulls drowned at abbey dhoddi village ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8263092-291-8263092-1596306413737.jpg)
నీటిలో మునిగి రెండు ఎద్దులు మృతి
అక్కడే ఉన్న గ్రామస్తులు నీటిలో చిక్కుకున్న రైతు సంజీవరెడ్డిని కాపాడారు. దీంతో రైతు ప్రాణాలు దక్కాయి. తన కళ్లెదుటే తన రెండు జీవాలు నీటిలో మునిగి మృతి చెందడంతో సంజీవ్ రెడ్డి కన్నీరు మున్నీరు అయ్యాడు. సుమారు లక్షల మేర ఆస్తి నష్టం వాటిళ్ళందని రైతు తెలిపాడు.