అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గరిసెలపల్లి వద్ద చిత్రావతి నదిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన శ్రీ రాములు... చిత్రావతి నది నుంచి ఇసుక తీసుకువచ్చేందుకు ఎడ్ల బండిని మరో వ్యక్తికి ఇచ్చి పంపించారు. ఇసుక నింపుకొని వస్తుండగా యజమాని కాకుండా కొత్త వ్యక్తి బండి నడిపాడు.
ఈ క్రమంలో ఎడ్లు బెదిరిపోయి గట్టుపై నుంచి నదిలోకి దూకాయి. ఈ ఘటనలో రెండు వృషభాలు నీటిలో మునిగి మృతి చెందాయి. గమనించిన స్థానికులు చనిపోయిన ఎద్దులను బయటికి తీశారు. ఎడ్లు మృతి చెందడంతో వాటి యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు.