కృష్ణాష్టమి రోజున విషాదం... ఇద్దరు చిన్నారులు మృతి - dead
కృష్ణాష్టమి రోజున విషాదం నెలకొంది. సెలవు కావటంతో సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారులు
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కరడిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి రెడ్డిపల్లి గ్రామ చెరువులోకి కొద్దిగా నీరు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావటంతో ఆ నీటిలో స్నానం చేయడానికి బన్నీ(7), బాలు(9) అనే అన్నదమ్ములు దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గుంటలో పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. చిన్నారుల మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.