ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

accident: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి - 63 నెంబర్ జాతీయ రహదారి తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గుత్తికి చెందిన ఖాజా మైను, రసూల్, విశ్వనాథ్​గా పోలీసులు గుర్తించారు.

ఢీకొన్న ద్విచక్ర వాహనాలు
ఢీకొన్న ద్విచక్ర వాహనాలు

By

Published : Jul 25, 2021, 4:59 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివార్లలోని 63 నెంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలుకోల్పోయారు. ఇద్దరు ఘటనా స్థలిలోనే చనిపోగా.. మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గుత్తికి చెందిన ఖాజా మైను, రసూల్, విశ్వనాథ్​గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details