ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి - ananthapuram district crime

అనంతపురం జిల్లా బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతిచెందాయి. వాటి కళేబరాలను పరిశీలించిన అధికారులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

two baby bears dead in baddikonda ananthapuram district
బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి

By

Published : Mar 17, 2021, 6:39 PM IST

అనంతపురం జిల్లా రొళ్ల మండలంలోని గుడ్డగుర్కి గ్రామ సమీపంలో ఉన్న బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి చెందాయి. గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ కళేబరాలను పరిశీలించిన అధికారులు అవి రెండు నెలల పిల్ల ఎలుగుబంట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details