అనంతపురంలో ఇద్దరు నకిలీ విజిలెన్స్ అధికారులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. పాపంపేటకు చెందిన వెంకటేశ్ బాబునాయక్, రాణినగర్ కు చెందిన రామాంజనేయనాయక్.. ఫుడ్ విజిలెన్స్ అధికారులమంటూ నగరంలోని ఓహోటల్ లో యాజమానిని బెదిరించారు. మెుదటి రోజు ఉచితంగా భోజనాలు తీసుకెళ్లారు.
మరుసటి రోజు రామాంజనేయులు డ్రైవర్‌నని చెప్పి మరో ఐదు భోజన ప్యాకెట్లు పార్శిల్ ఇవ్వమని అడిగాడు. ఆగ్రహించిన యాజమాని ఇవ్వనని స్పష్టం చేశాడు. ఫుడ్ విజిలెన్స్ అధికారులతోనే పెట్టుకుంటావా నీ అంతు చూస్తానని చెప్పి రామాంజనేయులు వెళ్లిపోయాడు.