ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

44 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు - హిందూపురం వార్తలు

'ఎంపీ గారూ... నేను ఇండస్ట్రియల్ సెక్రటరీ మాట్లాడుతున్నా...మీ నియోజకవర్గంలోని కేంద్రప్రభుత్వ రాయితీతో కూడిన రుణాలు మంజూరు కావాలంటే..మీ వాళ్లు నా అకౌంట్లో డబ్బులు వేయాలి'...అంటూ ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టిస్తూ..నగదు మాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం జిల్లాలోని హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేటుగాళ్లు మెుత్తం 44 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మోసం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

cyber crime in hindupuram
సైబర్ మోసం

By

Published : Jun 30, 2020, 1:00 AM IST

సైబర్ మోసం

కేంద్ర ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు మోసగాళ్లను అనంతపురం జిల్లా హిందూపురం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను లక్ష్యంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేస్తామని ఈ మోసాలకు పాల్పడ్డారని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్​కు.. ఇండస్ట్రియల్ సెక్రెటరీ మాట్లాడుతున్నానంటూ...ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేశాడు. "మీ పరిధిలోని వారు రుణాలకు నమోదు చేసుకోవాలి" అంటూ ఆయనకు నమ్మబలికాడు. అంతే. హిందూపురం నియోజకవర్గంలోని ఏడుగురు ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేయగా... మొదటగా లక్షా 25 వేల రూపాయల నగదు తన అకౌంట్లోకి జమ చేస్తే రాయితీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి.. మోసాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు.

స్థానిక ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవ్ వీరిపై ఆరా తీశారు. వారు సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులుగా గుర్తించి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులతో ఫిర్యాదు చేయించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మోసాలు పాల్పడినట్లుగా గుర్తించి.... వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు.

ఇప్పటికే మాజీ ప్రస్తుత 44 మంది ఎమ్మెల్యేలు ఎంపీలను బురిడీ కొట్టించిన వీరు నగదు మాయం చేసినట్టు తెలిసింది. వీరిపై హిందూపురం నియోజకవర్గంలోని ఒకటో, రెండో పట్టణ పోలీస్ స్టేషన్లు, చిలమత్తూరు పోలీస్ స్టేషన్​లో ఏడు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

'వైకాపా ఎమ్మెల్యే నుంచి ప్రాణ రక్షణ కల్పించండి'

ABOUT THE AUTHOR

...view details