ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి.. - నదులు

అనంతపూరం జిల్లాలో కర్ణాటక ఎగువ ప్రాంతాల్లోని  ఆగుంబె  మలనాడు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదులు భారీగా పొంగిపొర్లుతున్నాయి.

తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి..

By

Published : Aug 10, 2019, 10:21 AM IST

తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి..

అనంతపూరం జిల్లాలో కర్ణాటక ఎగువ ప్రాంతాల్లోని ఆగుంబె మలనాడు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదులు భారీగా పొంగిపొర్లుతున్నాయి. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1632 అడుగులు కాగా వరదనీరు వచ్చి చేరుతున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి 1622 అడుగులు నీటిమట్టం రాగ డ్యాములో 66 టీఎంసీలకు వరద నీరు చేరింది. 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 3931 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉన్నది. తుంగభద్ర కుడికాలువకు హెచ్ఎల్​సీకి 200 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేశారు. రెండు గంటలకు 200 క్యూసెక్కుల వంతెన నీటి విడుదల పెంచుతున్నట్లు జలాశయం అధికారులు పేర్కొన్నారు. తుంగభద్ర జలాశయానికి 170 టీఎంసీల మేర నీటి లభ్యత లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ ఎస్సీ రాజశేఖర్ ఇండెంట్ మేరకు హెచ్ఎల్​సీకి నీటిని విడుదల చేశారు. తుంగభద్ర కుడికాలువ ద్వారా అనంతపురం, కడప జిల్లాలోని తాగునీటి అవసరాలకు చెరువులోని నీటిని నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details