Gandy to the Canal: అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపం నుంచి తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా గుంతకల్ వైపు నీటిని తరలించే గుంతకల్ బ్రాంచ్ కెనాల్(జీబీసీ)కి విడపనకల్లు మండలం కరకముక్కల వంక వద్ద గండి పడింది. ఫలితంగా ఆ కాలువలోని సాగు, తాగునీరు వృథాగా వంకలోకి పోతున్నాయి. దీనిని గమనించిన జీబీసీ అధికారులు కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో కాల్వ పరిధిలోని ఉప కాలువలకు కూడా నీటి సరఫరా ఆగింది. అలాగే ఉండబండ గ్రామ సమీపంలో ఉన్న అండర్ టన్నెల్‌కు భారీగా రంద్రాలు పడి నీరు వృథాగా పోతోంది. కాలువ వెంట సుమారు 12 వేల ఎకరాల్లో మిరప, పత్తి, వరి పంటలు సాగులో ఉన్నాయి. జీబీసీ అధికారులు గండి పడిన చోట వెంటనే మరమ్మతులను పూర్తిచేసి సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
కెనాల్‌కు గండి ... వృథాగా నీరు..! - gandy at gunthakal branch canal
Gandy to the Canal: తుంగభద్ర ఎగువ కాలువ.. గుంతకల్ బ్రాంచ్ కెనాల్‌కు గండి పడింది. సాగు, తాగు నీరు వృథాగా పోతుండడంతో అధికారులు నీటిని నిలిపేశారు. ఫలితంగా కాలువ కింద సాగు చేస్తున్న పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. గండి పడిన చోట్ల వెంటనే మరమ్మతులను పూర్తిచేసి సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
తుంగభద్ర కెనాల్‌కు గండి