ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో తిరుపతి లడ్డూల విక్రయం - అనంతపురంలో తిరుపతి లడ్డూల పంపిణీ

జిల్లాల్లో తిరుపతి లడ్డూల విక్రయానికి తితిదే శ్రీకారం చుట్టారు. అనంతపురంలో లడ్డూల కోసం ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూ లైన్​లో వేచి కొనుగోలు చేశారు. ఒక్క లడ్డు 25 రూపాయల చొప్పున తితిదే విక్రయిస్తున్నారు.

ananthapuram district
అనంతపురంలో తిరుపతి లడ్డూల పంపిణీ

By

Published : May 25, 2020, 3:27 PM IST

అనంతపురంలో తిరుపతి లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని తితిదే వారు ప్రారంభించారు. లడ్డూల కోసం ఉదయం నుంచి ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూ లైన్ లో వేచి ఉండి లడ్డూలను తీసుకెళ్తున్నారు. లాక్​డౌన్ అమలులో ఉన్నందున స్వామివారి దర్శనానికి వీలు కాకపోవడంతో ప్రజలకు లడ్డులను అందించాలని నిర్ణయించినట్లు తితిదే వైకుంఠం ఏఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. జిల్లాకు 20 వేల లడ్డూలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం మరిన్ని లడ్డూలు తెప్పించి అందిస్తామని తెలిపారు. ఒక్క లడ్డు 25 రూపాయల చొప్పున విక్రయిస్తున్న ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details