కొవిడ్ ఉధృతి వేళ బాధితుల కోసం మెరుగైన చికిత్స అందిస్తున్న ఆర్డీటీ సేవలను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కొనియాడారు. ఈ మేరకు ఆయన ఆర్డీటీ డైరక్టర్ మాంచో ఫెర్రక్కు రూ.10 లక్షల చెక్కును అందించారు. కరవు ప్రాంతంలో పేదలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. తమ వంతు బాధ్యతగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం సీతంపేటలో సాహు మహారాజ్ దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, ఫేస్షీల్డ్స్, మాస్కులను అందించారు. వీటితో పాటు 40 కుటుంబాలకు కూరగాయలను అందించారు.