ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో త్రిపుర మహిళ మృతి - హరిపురం రోడ్డు ప్రమాదం న్యూస్

అనంతపురం జిల్లా హరిపురం వద్ద జరిగిన ప్రమాదంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

accident
రోడ్డు ప్రమాదంలో త్రిపుర మహిళ మృతి

By

Published : Sep 1, 2020, 10:48 AM IST

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం హరిపురం 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో త్రిపుర రాష్ట్రానికి చెందిన బీతా అనే మహిళ మృతి చెందగా.. మరో 8 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారందరూ స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్​లో పని చేస్తున్న వారని పోలీసులు తెలిపారు. వీరంతా గొల్లపల్లి జలాశయాన్ని చూసేందుకు వెళ్లి, తిరుగు ప్రయాణమవ్వగా.. పెనుగొండ కూడలి వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీతా అనే త్రిపుర మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో గాయాలుపాలైన వారందర్నీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ దాదా పీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. ఘటనపై కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details