ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాయాత్రకు 3 ఏళ్లు: ఎంపీ మాధవ్ సహా శ్రేణుల పాదయాత్ర - హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్

ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తైనందున వైకాపా శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పాదయాత్ర చేపట్టారు.

ప్రజాయాత్రకు 3 ఏళ్లు : వైకాపా శ్రేణుల పాదయాత్ర
ప్రజాయాత్రకు 3 ఏళ్లు : వైకాపా శ్రేణుల పాదయాత్ర

By

Published : Nov 8, 2020, 5:06 PM IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైకాపా శ్రేణులు సంఘీభావ పాదయాత్రలో చేపట్టారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్, కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి కటారుపల్లి క్రాస్ నుంచి మండల పరిధిలోని కటకంవారి పల్లి వరకు పాదయాత్ర చేపట్టారు.

అక్కడే మొక్క నాటారు..

సంకల్ప యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కటారుపల్లి క్లాసులో ఒక మొక్క నాటారు. ఆ మొక్క సమీపంలోనే ఎంపీ, ఎమ్మెల్యే మొక్క నాటి పాదయాత్రను ప్రారంభించారు.

90 శాతం హామీలు అమలు..

వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నరలోనే 90% హామీలను అమలు చేసినట్లు ప్రజా ప్రతినిధులు తెలిపారు. మేనిఫెస్టోతోపాటు ఎన్నికల హామీలను అమలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టని విప్లవాత్మక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. కుల మత ప్రాంత వర్గ భేదాలు లేకుండా అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ వైకాపా ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ఎంపీ మాధవ్ కోరారు.

ఇవీ చూడండి : కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ

ABOUT THE AUTHOR

...view details