అమెరికాలో ఉన్న తెలుగు వారి సంక్షేమమే లక్ష్యంగా "తానా" పనిచేస్తుందని.. ఆ సంఘం అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు. అనంతపురం కమ్మభవన్‌లో తానా అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లాలనుకునే యువత మంచి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుని రావాలని సూచించారు.
TANA PRESIDENT: 'అమెరికాలో ఏ సాయం కావాలన్నా.. "తానా"ను సంప్రదించాలి' - అనంతపురం కమ్మభవన్‌లో తానా అధ్యక్షుడికి సన్మానం
అమెరికాలోని తెలుగువారి సంక్షేమమే లక్ష్యంగా "తానా" పనిచేస్తుందని.. ఆ సంఘం అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు. అనంతపురం కమ్మభవన్‌లో ఆయనను ఘనంగా సన్మానించారు.
'అమెరికాలో ఏ సాయం కావాలన్నా తానాను సంప్రదించాలి'
అమెరికాలో చదువుకోవాలనుకునే యువతకు కెరీర్ గైడెన్స్ అందిస్తున్నామని, అక్కడికి వచ్చిన వారు ఏ సహాయం కావాలన్నా.. తానాను సంప్రదించాలని చెప్పారు. కుటుంబ కలహాల్లో భార్యా, భర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వటానికి మహిళలతో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసినట్లు నిరంజన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కొనసాగుతున్న.. పరిషత్ ఎన్నికల పోలింగ్