అనంతపురం జిల్లా కదిరిలో ఈదురుగాలుల ధాటికి చెట్లు, హోర్డింగ్స్ కూలిపోయాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద భారీ వృక్షం విరిగి పడటంతో ప్రహరీ ధ్వంసమైంది. కుటాగుళ్లలో నివాసాల మధ్య చెట్టు కూలి ద్విచక్రవాహనాలపై పడింది. దీంతో బైక్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కదిరి ప్రాంతీయ వైద్యశాల ప్రహరీ వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ పడిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కదిరిలో ఈదురుగాలులు: కూలిన చెట్లు, హోర్డింగ్స్ - Anantapur district latest news
వాతావరణ మార్పుల కారణంగా అనంతపురం జిల్లా కదిరిలో ఈదురుగాలులు వీచాయి. బలమైన గాలుల ధాటికి చెట్లు హోర్డింగ్స్ కూలిపోయాయి.
ఈదురుగాలుల వల్ల కూలిన చెట్లు