అనంతపురంలో కొవిడ్ బాధితులకు పడకలు సరిపోకపోవడంతో కుర్చీల్లోనే చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అదనపు పడకల ఏర్పాటు కోసం ఆస్పత్రి ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని కేటాయించారు. కొవిడ్ ఓపీ ఆక్సిజన్ సేవలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ బాధితులు వారి బంధువులు జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అదనపు పడకలు త్వరగా ఏర్పాటు చేసి బాధితులకు సహకారం అందించాలని వారు కోరారు.
కుర్చీల్లోనే కొవిడ్ బాధితులకు చికిత్స - Anantapur government hospital
అనంతపురంలో పడకలు సరిపోకపోవడంతో కుర్చీలలోనే కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కుర్చీలలోనే కోవిడ్ బాధితులకు చికిత్స