ప్రయాణికులు విడిది కేంద్రం కూల్చివేశారని నిరసన - ananthapur dist news
హిందూపురం గ్రామీణ మండలం బేవనహళ్లిలో ప్రయాణికుల కోసం నిర్మించిన విడిది కేంద్రాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని... తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
![ప్రయాణికులు విడిది కేంద్రం కూల్చివేశారని నిరసన Travelers protest that the lodging center has been demolished](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7305763-935-7305763-1590171676702.jpg)
ప్రయాణికులు విడిది కేంద్రం కూల్చివేశారని...నిరసన
అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం బేవనహళ్లిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన విడిది కేంద్రాన్ని వైకాపా నాయకులు కూల్చివేశారని ఆరోపిస్తూ తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నీటికేంద్రం ఏర్పాటు పేరుతో ప్రయాణికుల విడిది కేంద్రాన్ని కూల్చివేయటం సరికాదని... విడిది కేంద్రాన్ని నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వీఆర్ఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.