ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాటిని బీఎస్​4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు: రవాణాశాఖ - అనంతపురం బీఎస్​3 వాహనాల వార్తలు

అనంతపురంలో దొరికిన బీఎస్‌3 వాహనాలపై విచారణ జరుగుతుందని.. రవాణశాఖ వెల్లడించింది. బీఎస్‌3 వాహనాలను అశోక్ లేలాండ్‌ నుంచి కొనుగోలు చేశారని స్పష్టం చేసింది. కొనుగోలు చేశాక బీఎస్‌ 4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని రవాణశాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు వెల్లడించారు.

Transportation department about ananthapuram bs3 vehicles
Transportation department about ananthapuram bs3 vehicles

By

Published : Jun 9, 2020, 2:04 PM IST

అనంతపురంలో దొరికిన బీఎస్​3 వాహనాలపై విచారణ జరుగుతుందని రవాణా శాఖ తెలిపింది. వాహనాలు మొత్తం నాగాలాండ్ నుంచి ఏపీకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. స్క్రాప్‌ కింద అమ్మిన వాహనాలకు బీఎస్‌4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారని.. స్క్రాప్ కింద కొన్న 154 వాహనాల్లో ఏపీలోనే 101 ఉన్నాయని తెలిపింది. 54 వాహనాలు నాగాలాండ్ నుంచి తీసుకొచ్చారని.. అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎన్​వోసీతో ఏపీలో నడుపుతున్నారని రవాణాశాఖ స్పష్ట చేసింది. జటాదరా ఇండస్ట్రీస్, సి.గోపాల్ రెడ్డి వాహనాలను ఏపీకి తీసుకొచినట్లు తెలిపింది. కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల వారికి వాహనాలను అమ్మేశారని వెల్లడించింది. దీనిపై ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖలు రాశామని రవాణా శాఖ వెల్లడించింది.

బీమా కంపెనీలు కూడా జాగ్రత్తలు వ్యవహరించాలని కోరామని రవాణాశాఖ తెలిపింది. నాగాలాండ్ నుంచి వచ్చిన మిగిలిన 39 వాహనాల కోసం తనిఖీలు చేస్తున్నామని వివరించింది. కొత్తగా వాహనాలు కొన్నవారు... అమ్మిన వారివల్ల నష్టపోయారని.. బీమా ఎలా చేశారనే దానిపై విచారణ చేస్తే 71 పాలసీలు నకిలీవని తేలిందని రవాణాశాఖ అధికారులు వివరించారు. సి.గోపాల్‌రెడ్డి ఆఫీసులో 41 నకిలీ పాలసీలు దొరికాయన్నారు. జటాదరా పరిశ్రమ 18 నకిలీ పాలసీలు సృష్టించాయని గుర్తించామన్నారు. విచారణ జరిపి కేసులు నమోదు చేయబోతున్నామని.. వాహనాలు కొనుగోలు చేసిన వారి పాత్రపై కూడా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఏడాదిగా అక్రమంగా వాహనాలను రోడ్లపై తిప్పుతున్నారని.. ఇతరుల పాత్ర ఉంటే కచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: ఆ లారీలు అమ్మారని జేసీ ప్రభాకర్​ రెడ్డిపై కేసు

ABOUT THE AUTHOR

...view details