అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లురాంపురంలో సుమారు 2 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, వారు పరారవ్వడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు రంగంలోకి దిగి... రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎవరు.. ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - AP GOVT
రేషన్ బియ్యం అక్రమ తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు వెంటనే వారిని అడ్డుకుని ప్రశ్నించగా... వారు పరారయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీస్ స్టేషన్