ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుకొండలో విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య

పెనుకొండ పట్టణంలోని వేణుగోపాలస్వామి గుడి వద్ద ఒకే ఇంట్లో 3 మృతదేహాలు ఉండటం కలకలం రేపింది. వారి ఇంటి పక్కన వాళ్లకు దుర్వాసన రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్​కు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతులు.. విశ్రాంత బ్యాంక్ మేనేజర్ అశ్వర్థయ్య, అతని చెల్లెల్లు నాగరత్నమ్మ, యశోదమ్మగా పోలీసులు గుర్తించారు.

అన్న, ఇద్దరు చెల్లెల్లు ఆత్మహత్య
అన్న, ఇద్దరు చెల్లెల్లు ఆత్మహత్య

By

Published : May 25, 2021, 6:31 PM IST

పెనుకొండ ఎస్సై వెంకటేశ్వర్లు

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని మెయిన్​బజార్ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ అశ్వర్థయ్య(79), అతని ఇద్దరు చెల్లెళ్లు నాగరత్నమ్మ(75), యశోదమ్మ(72) మూడు రోజుల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అశ్వర్థయ్య అవివాహితులైన చెల్లెళ్లతో కలసి నివసిస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... ఇంట్లో పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించాయి. ఇంట్లో వినియోగించే కీటకనాశిని మందును సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

వయసు మీద పడటంతో సొంత పనులు చేసుకోవడం కష్టం అయ్యింది వారికి. ఇంటికి వచ్చే పని మనిషి కూడా కొన్ని రోజులుగా రావట్లేదు. సొంత పనులు చేసుకోవడం సాధ్యం కాక జీవించడం కష్టమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పెనుకొండ ఎస్సై వెంకటేశ్వర్లు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండీ... రైతులను ఆదుకునేందుకే ఉచిత పంటల బీమా: సీఎం

ABOUT THE AUTHOR

...view details