మాకు లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వండి - trade associations anantapuram news
హిందూపురంలో వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలకు లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వాలంటూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. అధికారులు ఈ విషయమై స్పందించి ఒకటో తారీఖు నుంచి అయిన దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ తహసీల్ధార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
![మాకు లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వండి trade associations demands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7393365-338-7393365-1590743338258.jpg)
అనంతపురం జిల్లా హిందూపురంలో వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలకు లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వాలంటూ ఆందోళన నిర్వహించారు. లాక్‌డౌన్ విధించి 70 రోజులు గడుస్తున్నా ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం కారణంగా ఇటు వ్యాపారస్తులు అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సడలింపులు ఇచ్చినప్పటికీ హిందూపురంలో ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి వర్తక వ్యాపార వాణిజ్య సముదాయాలకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి..