ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని టి.సదుం వద్ద నది ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయడంలో విఫలమైన డ్రైవర్ ట్రాక్టర్ను వాగులోని కల్వర్టు మీదుగా ఆవతలి వైపునకు వెళ్లే ప్రయత్నం చేశాడు. సగం మార్గంలోకి వెళ్లగానే ఉద్ధృతి మరింత పెరిగింది. ముప్పును గుర్తించిన
చోదకుడు పక్కకు దూకేసి ప్రమాదం నుంచి బయట పడ్డాడు. తరువాత స్థానికులు జేసీబీ సాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు.
tractor stuck: వరదలో చిక్కుకుపోయిన ట్రాక్టర్ - పాపాగ్ని నదిలో చిక్కుకుపోయిన ట్రాక్టర్
భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహాన్ని అంచనా వేయటంలో విఫలమైన డ్రైవర్... ట్రాక్టర్ను కల్వర్టు మీదుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సగం మార్గంలోకి వెళ్లగానే ప్రవాహ ఉద్ధృతిని గుర్తించిన డ్రైవర్ పక్కకు దూకేసి ప్రమాదం నుంచి బయట పడ్డాడు. తరువాత స్థానికులు జేసీబీ సాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు.
tractor stuck
వర్షాల కారణంగా తనకల్లు మండలం చీకటిమానుపల్లిలోని అంగన్ వాడి కేంద్రం చుట్టూ.. వర్షపు చేరి మడుగులా తయారైంది. అంగన్ వాడి కేంద్రంలోకి వెళ్లేందుకు కూడా వీల్లేకుండా పోయింది. పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి