ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తికొండలో ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు - గుత్తికొండలో ట్రాక్టర్ ప్రమాదం

ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సమీపంలో జరగగా.. ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.

tractor rolled off at guttikonda
గుత్తికొండలో ట్రాక్టర్ బోల్తా

By

Published : Mar 19, 2021, 1:58 PM IST

గుత్తికొండలో ట్రాక్టర్ బోల్తా
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ బోల్తాపడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయయ్యాయి. నకరికల్లు మండలం గుళ్లపల్లికి కొందరు మహిళలు కూలీ పనుల కోసం ట్రాక్టర్​లో గుత్తికొండ వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న కారుని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ.. షేక్ మస్తాన్ బీ అనే మహిళ మృతి చెందింది. మరో ఎనిమిది మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details