ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు కొడతారేమోనని ఎంత పని చేశాడంటే..! - అనంతపురం జిల్లా నేర వార్తలు

Suicide Attempt: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లికి చెందిన ట్రాక్టర్​ డ్రైవర్​.. పోలీసులు కొడతారనే భయంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతనికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

tractor driver suicide attempt  at Anantapur district
పోలీసులు కొడతారనే భయంతో.. ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 3, 2022, 9:42 PM IST

Anantapur District News: పోలీసులు తనను కొడతారనే భయంతో ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన శివయ్య.. ట్రాక్టర్ డ్రైవర్​గా పనిచేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ను పట్టుకున్న పోలీసులు.. డ్రైవర్ శివయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో స్టేషన్​లో ఓ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్న తీరును చూసిన శివయ్య.. తనను కొడతారేమోననే భయంతో అక్కడినుంచి పారిపోయాడు. భయాందోళనకు గురైన శివయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తనను బెదిరించారని శివయ్య భార్య తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details