Tomato farmers protest: అనంతపురం జిల్లాలో టమాటో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. టవర్ క్లాక్ వద్ద టమాటోలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న రైతులను, రైతు సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పంట నష్టపోతే వ్యవసాయ శాఖ అధికారులు రాయితీలు కల్పించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి... నష్టపోయిన టమాటో రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ధర రాక.. కొనేవాళ్లు లేక.. టమాటా రైతుల ఆందోళన - టమాటా రైతుల ఆందోళన
No price to Tomatos: అనంతపురం జిల్లాలో టమాటా రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. పండించిన పంటను కొనేవాళ్లు లేక.. కనీసం మార్కెట్కు తీసుకువచ్చిన చార్జీలు సైతం రాకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై టమాటాలు పారబోసి.. బైఠాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతులు, రైతు సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
tomato
Last Updated : Aug 8, 2022, 10:14 PM IST