తొలి ఏకాదశి మహా పర్వదినం పురస్కరించుకుని దేవాలయాలలు భక్త జనసందోహాలుగా మారాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కిక్కిరిసింది. జ్యోతుల ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. గ్రామంలో ని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ప్రజలందరికీ తీర్థప్రసాదాలు అందచేశారు.
కనుల పండుగగా జ్యోతుల ఉత్సవం
తొలి ఏకాదశిని అనంతపురం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. హరినామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కదిరేపల్లి గ్రామంలో వివిధ ఆలయాలలో విశేష పూజలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలు అందించారు.
'కనుల పండుగగా జ్యోతులోత్సవం'