మండలి రద్దుపై ఏకపక్షనిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నేడు బ్లాక్‌డేగా అభివర్ణించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాక అసెంబ్లీలో చర్చించడం అనైతికమన్నారు. మండలిని పునరుద్ధరించాలని 5 రాష్ట్రాలు కోరుతుంటే..వైకాపా ప్రభుత్వం మాత్రం రద్దు నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. మరో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ... ఈ రోజు జరిగిన శాసనసభకు 18 మంది వైకాపా సభ్యులు గైర్హాజరయ్యారన్నారు. వారంతా మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించినట్లేనని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యానికి ఇవాళ బ్లాక్ డే: తెదేపా ఎమ్మెల్సీలు - ప్రజస్వామ్యంలో బ్లాక్ డే
మండలి రద్దుపై వైకాపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చీకటి రోజని అభివర్ణించారు.
![ప్రజాస్వామ్యానికి ఇవాళ బ్లాక్ డే: తెదేపా ఎమ్మెల్సీలు తెదేపా ఎమ్మెల్సీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5863788-955-5863788-1580137333295.jpg)
తెదేపా ఎమ్మెల్సీలు