అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రానికి సమీపంలో గల చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తుల నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీన పరచుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. నార్పలకు చెందిన వేణుగోపాల్, ఆనంద్ అనే ఇద్దరి వద్ద ఉన్న సరుకుని సీజ్ చేశామన్నారు. ఈ ఉత్పత్తులు సుమారు రూ.12వేలు విలువ చేస్తాయని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పోలీసుల తనిఖీలు.. నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్వాధీనం - Police inspections in Anantapur district
అనంతపురం జిల్లా రొద్దం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు స్వాధీన పరచుకున్న పొగాకు ఉత్పత్తులు