ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆయన మాటలకు.. చేతలకు పొంతన లేదు' - bjp suresh reddy

ముఖ్యమంత్రి చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి విమర్శించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తుందని మండిపడ్డారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి

By

Published : Jul 29, 2019, 11:16 PM IST

ఇసుక నూతన విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా కదిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన బాటలోనే వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లంచాలు తీసుకుంటూ అవినీతికి బాటలు వేస్తున్నారని విమర్శించారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని లేని పక్షంలో తెదేపాకి పట్టిన గతే వైకాపాకు పడుతుందని హెచ్చరించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details