అనంతపురం జిల్లా కంబదూరు మండలం నెమలికొండపై వెలసిన తిమ్మప్ప ఆలయంలో ముగ్గురు దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టారు. అయితే ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న కొంతమంది గ్రామస్థులు వినికిడి విని అప్రమత్తమై… దుండగుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతను చెన్నంపల్లి వాసిగా గ్రామస్థులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలయం చేరుకున్న పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
తిమ్మప్ప ఆలయంలో చోరీకి యత్నం… పట్టుకున్న గ్రామస్థులు - nemalikonda timmappa temple latest news
ములకలూరు శివారులో నెమలికొండపై వెలసిన తిమ్మప్ప ఆలయంలో మంగళవారం ముగ్గురు దుండగులు చోరీకి యత్నించారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న గ్రామస్థులు శబ్దాలకు లేచారు. చోరీకి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
తిమ్మప్ప ఆలయంలో చోరీకి యత్నించిన దుండగుడు