కనిశెట్టిపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ ఎర్ర కొండ అటవీ ప్రాంతం ఉంది. అడవిలో చిరుతపులి జింకను వేటాడుతూ.. గ్రామ సమీపంలోనీ పంట పొలాల్లో.. చంపి తినేసింది. గ్రామస్థులు ఈ ఆనవాళ్లు గుర్తించి ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు వెళ్లి చూడగా.. జింక కళేబరం దొరికింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని చిరుత జన జీవన ప్రాంతంలో సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. వేసవి కాలం కారణంగా అడవి నుంచి చిరుతలు బయటకు వస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. కనిశెట్టిపల్లి పరిసర ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. జింక కళేబరాన్ని పోస్టుమార్టం అనంతరం దహనం చేసినట్లు పేర్కొన్నారు.