అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దిన్నేమీదిపల్లిలో ఉదయం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో జల్లులు పడ్డాయి. భయాందోళనతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. రంగంపల్లిలో పిడుగుపడి గుడిసె దగ్ధమైంది. అందులో ఉన్న రెండు గొర్రెలు, కోళ్లు మంటల్లో సజీవదహనమయ్యాయి.
అనంతలో భారీ వర్షం.. పిడుగుపడి గుడిసె దగ్ధం, గొర్రెలు, కోళ్లు సజీవదహనం - పిడుగుపడి గుడిసె దగ్ధం తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షానికి.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపడి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో రెండు గొర్రెలు, కోళ్లు సజీవదహనమయ్యాయి.
వర్షానికి పిడుగుపడి గుడిసె దగ్ధం