అనంతపురం జిల్లా కంబదూరు మండలం మరిమాకులపల్లిలో గుర్తుతెలియని దుండగులు రెండు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు అంగడి తిప్పేస్వామి తన మోటారు సైకిళ్లను ఇంటి ఆవరణలో నిలిపి ఉంచారు. తెల్లవారిన తరువాత చూస్తే వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు - assault
ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు Thugs who set fire to two-wheelers in Anantapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6759510-146-6759510-1586669737744.jpg)
అనంతపురం జిల్లాలో ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు