అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకొండ గ్రామ పరిధిలో 16 మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు తన ఐదెకరాల పొలంలో ఆరు నెలల క్రితం మామిడిచెట్లను నాటగా, అందులో కొన్నింటిని పీకి వేసినట్లు ఆయన తెలిపారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇటువంటి సంఘటనలకు పాల్పడి ఉండవచ్చని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటువంటి సంస్కృతి అధికమవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మామిడిచెట్లను నరికేసిన గుర్తుతెలియని వ్యక్తులు - అనంతపురంలో మామిడిచెట్లను పీకేసిన దుండగులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకొండ గ్రామపరిధిలోని 15 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని బాధిత రైతు వాపోయారు.
మామిడిచెట్లను పీకేసిన గుర్తుతెలియని వ్యక్తులు