ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మామిడి చెట్లను నరికేసిన దుండగులు...వైకాపా వర్గీయులేనని రైతు ఆరోపణ - అనంతపురం జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Thugs cut down mango trees: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచి రెడ్డిపల్లిలో ఓ రైతుకు చెందిన 70 చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. విషయం తెలుసుకున్న మల్లయ్య బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తను తెదేపా సానుభూతిపరుడు కావడంతోనే... వైకాపాకి చెందిన కొందరు కలిసి ఇలా చేశారని ఆరోపించాడు. కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వర అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.

Thugs cut down mango trees
మామిడి చెట్లను నరికేసిన దుండగులు

By

Published : Apr 6, 2022, 7:52 PM IST

Thugs cut down mango trees: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతుకు చెందిన 70 మామిడి చెట్లను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న రైతు బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తెదేపా సానుభూతిపరుడు కావడంతోనే వైకాపా వర్గీయులు తన చెట్లను నరికేశారని ఆరోపించాడు. కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర్ నాయుడు మామిడి పొలాలను పరిశీలించి...అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో మనుషులకే కాకుండా చెట్లకు కూడా రక్షణ కరువైందని ఉమామహేశ్వర్​ నాయుడు విమర్శించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్​ చేశారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: Pattabi: 'అతని బినామీ కంపెనీలకు తక్కువ ధరకే భూమిని కట్టబెడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details