పలు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం గోవిందరాయుని పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొర్రపాడుకు చెందిన సంజప్ప ద్విచక్రవాహనానికి అడ్డుగా అడవి పందులు రావడంతో అదుపుతప్పి కింద పడ్డాడు. క్షతగాత్రుడిని సింగనమల ప్రభుత్వాసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి - accidents in anantapur district
రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమదాల్లో ముగ్గురు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాలకు చెందిన షేక్ మస్తాన్(13) రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు. కర్నూలు జిల్లా అదోనిలో ద్విచక్ర వహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి చామరాజ మృతి చెందారు.
ఇదీ చదవండి