అనంతపురానికి చెందిన గణపతి, పుష్పక, కళ్యాణ్ కుమార్ ముగ్గురు స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలని యోచించారు. అందుకోసం హైదరాబాద్ నుంచి అనంతపురానికి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునేవారు. నెల రోజులుగా అనంతపురం శివారు కాలనీ తపోవనంలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉన్నారు. విషయం పోలీసులకు తెలియటంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితుల నుంచి లక్ష విలువ చేసే 152 మద్యం బాటిళ్లను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
జల్సాల కోసం అక్రమాలు.. అరెస్ట్ అయిన ముగ్గురు మిత్రులు - అనంతపురం అక్రమ మద్యం కేసులు
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అక్రమాలకు పాల్పడ్డారు ముగ్గురు మిత్రులు. కర్ణాటక మద్యాన్ని అక్రమంగా అనంతపురానికి తరలించి సొమ్ము చేసుకునేవారు. విషయం కాస్త పోలీసులకు తెలియటంతో వారిని అరెస్ట్ చేశారు.
ముగ్గరు వ్యక్తులు అరెస్ట్