అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న లారీ..ఎదురుగా వస్తున్న బోలెరో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తుండగా..ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ ,అష్రఫ్ అలీ , కర్నూలు జిల్లాకు ఖాశీం మహమ్మద్లుగా అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
accident: కారు- లారీ ఢీ.. ముగ్గురు అక్కడికక్కడే మృతి - గుత్తి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ప్రమాదం
05:45 August 02
అనంతపురం జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి
విషయం తెలుసుకున్న సీఐ రాము హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు శ్రమించారు. మృత దేహాలు కారులో చిక్కుకోవడంతో క్రేన్ల సహాయంతో... బయటికి తీశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..
Last Updated : Aug 2, 2021, 8:09 AM IST