Three people died due to electric shock : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. కడప శివారులోని ఖాదర్ గాని కొట్టాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శశాంక్ (12), మనోజ్(4) ఇంటిపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. గ్రామంలో తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.
బంధువులైన ఈ చిన్నారులు సరదాగా ఇంటిపైకి ఎక్కి ఆడుకుంటుండంగా.. తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటాన్ని గమనించని చిన్నారులు... ప్రమాదవశాత్తు వాటిని తాకడంతో విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ పిల్లల ప్రాణాలు పోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.