ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షాహిదా బేగం హత్యకేసులో మరో ముగ్గురు అరెస్టు

అనంతపురం జిల్లా చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం హత్య కేసులు పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసుకు సంబంధించి ఆదివారం మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందికి అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరలోనే నిందుతులపై ఛార్జిషీటు దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు.

anantapur shahidabegam murder case
anantapur shahidabegam murder case

By

Published : Nov 30, 2020, 4:27 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఏ.శ్రీనివాసులు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ ఎన్ రమ్య, గ్రామీణ సీ.ఐ శివశంకర్ నాయక్​తో కలిసి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.

పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం... షాహిదా బేగం హత్య కేసులో ప్రధాన నిందితుడు బెస్త రఘు సహా ఐదుగుర్ని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. తాజాగా బెస్త రఘు తండ్రి ఎర్రిస్వామి, సోమశేఖర్, రాధికలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురితో కలిపి మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. షాహిదా బేగం హత్య కేసును ప్రాధాన్యతగా పరిగణించి బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేయాలన్న సంకల్పంతో జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఈ కేసును రెండ్రోజుల కిందట దిశ పోలీసు స్టేషన్​కు అప్పగించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాసులు దర్యాప్తులో భాగంగా షాహిదాబేగం తల్లిదండ్రులను, సాక్షులను విచారించారు. నేరస్థలాన్ని పరిశీలించి లభించిన ఆధారాలను బట్టి హత్య కేసులో కుట్రదారులైన బెస్త ఎర్రిస్వామి, సోమశేఖర్ , రాధికలను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. హత్య జరిగిన రోజు ప్రధాన నిందితుడు వినియోగించిన సెల్ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్​లో ఉన్న బెస్త రఘును పోలీసు కస్టడికి తీసుకుని త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులందరిపైన ఛార్జిషీటు దాఖలు చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి :రాజస్థాన్​లో ప్రకాశం పోలీసులపై దాడులు..!

ABOUT THE AUTHOR

...view details