ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటకలో పేలుడు.. రాయదుర్గానికి చెందిన ముగ్గురు మృతి - rayadurgam residents died news

కర్ణాటకలోని హునసోడు గ్రామ శివార్లలో జరిగిన పేలుడు ప్రమాదంలో అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇద్దరి చిరునామాను పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

died
పేలుడు ప్రమాదంలో మరణించిన వ్యక్తులు

By

Published : Jan 23, 2021, 11:26 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని హునసోడు గ్రామ శివార్లలో జరిగిన పేలుడు ప్రమాదంలో మృతి చెందారు. మృతులను గొల్ల పవన్​, జావిద్, గొల్ల రాజుగా గుర్తించారు. పవన్​, జావిద్​ల వివరాలు సేకరించగా.. రాజు చిరునామా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రాయదుర్గానికి చెందిన ఈ ముగ్గురు.. శ్రీరాములు అనే వ్యక్తి వద్ద పని చేసేవారు. అనంతపురంతో సహా కర్ణాటకకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. క్వారీలకు పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు పట్టణం నుంచి కర్ణాటకకు బయలుదేరారు. ప్రమాదవశాత్తు ఆ పదార్థాలు పేలి.. అక్కడిక్కకడే మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details